తెలుగు ప్రజలు ప్రతి పండుగను కూడా చాలా ఆనందంగా కుటుంబంతో కలిసి జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పెద్ద పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉద్యోగం, చదువు ,పని నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా సంక్రాంతి పండుగను తమ సొంత ఊరిలోనే జరుపుకోవాలని వస్తారు. ప్రతి ఏడాది కూడా సంక్రాంతికి విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇవ్వడం సర్వసాధారణం. అందుకే విద్యార్థులు కూడా సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా? సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.


తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్కూల్ సెలవులు ఎప్పుడు ఉంటాయనే విషయం  ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ప్రకారం సంక్రాంతి సెలవులు 2026 జనవరి 10వ తేదీ నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత జనవరి 18వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయట. మొత్తం మీద 9 రోజులపాటు ఈ సంక్రాంతి సెలవులు రాబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సైతం ఈ సెలవులు వర్తిస్తాయి.


 ఇక తెలంగాణ విషయానికి వస్తే జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే సెలవులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. వీటి పైన త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నది. ఎప్పటిలాగే తమ సొంత ఊర్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి ముందుగానే బస్ టికెట్, ట్రైన్ టికెట్లను సైతం బుక్ చేసుకోవడం కోసం ఇప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రయాణాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకించి మరి బస్ సర్వీసులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనవరి నెలలో అదనంగా జనవరి 23న వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం కూడా పాఠశాలలకు సెలవు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: