చిదంబరం పై సీబీఐ ఈడీ దాడుల అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అరెస్ట్పై రకరకల వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీబీఐ కోర్టు లో హాజరుపర్చనున్నారు. నిన్నే అరెస్టయిన అయినట్లు సీబీఐ అధికారులు హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. రాత్రంతా ఆయన సీబీఐ కస్టడీ లోనే ఉంచారు అనంతరం రాంమనోహర్ లోహియా ఆస్పత్రి కి తరలించి వైద్య పరీక్ష లు నిర్వహించారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హై కోర్టు తిరస్కరణ తో హైడ్రామా నడిచింది. హై కోర్టు తీర్పు పై స్టే కోసం వేసి న పిటిషన్ పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు లో చెప్పింది. ఇదే సమయంలో చిదంబరాన్ని సీబీఐ అదుపు లోకి తీసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి అదృశ్యమైన చిదంబరం కోసం సీబీఐ, ఈడీ బృందాల గాలించాయి. అనూహ్యంగా బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన ఢిల్లీ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం లో ప్రత్యక్షమయ్యారు. తాను ఎటువంటి తప్పు చేయ లేదని స్పష్టం చేశారు అనంతరం చిదంబరం జోరుబాగ్ లోని తన నివాసానికి వెళ్లారు.


కొద్ది నిముషాలకే సీబీఐ బృందం చిదంబరం తలుపు తట్టింది. చిదంబరం గేట్లు ఓపెన్ చేయక పోవటం తో సీబీఐ అధికారు లు ప్రహరీ గోడలు దూకి ఇంట్లో కి ప్రవేశించారు. కొద్దిసేపటికీ ఈడీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిదంబరాన్ని అదుపు లోకి తీసుకుని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీని వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి హమీ అమిత్ షా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్రం లో యూపీఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరం ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రి గా అమిత్ షా పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి కటకటాలపాలైయ్యారు.


చిదంబరం అరెస్టు విషయం లో కార్తీ చిదంబరం మాట్లాడారు అయితే ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో వీళ్లకు వందల కోట్ల ముడుపులు అందాయి చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం కు అన్న ఆరోపణల నేపథ్యంలోనే చిదంబరం ని అరెస్ట్ చేశారు. అయితే మీడియా అడిగిన ప్రశ్న లకు కార్తీ చిదంబరం బదులిచ్చారు. ఆయన ఎటువంటి నేరం చేయలేదు ఎటువంటి తప్పు తాము చేయలేదు అని చెప్తున్నారు. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారం తో తనకెలాంటి సంబంధమూ లేదని ఇంద్రాణి ముఖర్జియా కానీ పీటర్ ముఖర్జియా ని కానీ తాను ఎప్పుడూ కలవలేదు అసలు వాళ్లనెప్పుడూ చూడను కూడా చూడలేదు అని కార్తీ  చెప్తున్నారు. ఒకే ఒక్కసారి చూశాను అది కూడా వేరే సందర్భంలో చెబుతున్నారు. తాము ఎటువంటి తప్పూ చేయలేదు అయినా కూడా సిబిఐ తన తండ్రిని అరెస్ట్ చేసింది అని కార్తీ చిదంబరం చెప్తున్నారు. నిన్న చిదంబరం మాట్లాడుతూ కూడా తాను ఎటువంటి తప్పు చేయలేదు అని వ్యాఖ్యా నించారు.


మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీబీఐ కోర్టు లో హాజరుపర్చనున్నారు. నిన్న అరెస్టైన ఆయన ను సీబీఐ అధికారు లు హెడ్ క్వార్టర్స్ కు తరలించారు రాత్రంతా ఆయనను సీబీఐ కస్టడీ లోనే ఉంచారు . అయితే ఇదంతా పూర్తి గా రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపే అంటున్నారు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు లను అణగదొక్కాలన్న ప్రయత్నమే అన్నారు. తన తండ్రి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ   వారి తప్పు లను ఎండగడుతున్నారన్నారు అని అందుకే  అరెస్ట్ చేయించారన్నారు. లీగల్ గా ఈ కేసు నిలబడదని, పెట్టిన కేసులన్నీ అక్రమమైనవి ఆయన అన్నారు. రెండు వేల ఎనిమిది లో జరిగిన దానికి రెండు వేల పదిహెడు లో కేసులు నమోదు చేశారని ఏ సంబంధం లేని తనకు ఇరవై ఏడు సార్లు నోటీసులు పంపారు అన్నారు. తనకు పరిచయముంటే చాలు వాళ్లందరినీ వేధింపులకు గురి చేశారని కార్తీ మండిపడ్డారు.ఈ కేసులో మరెన్ని కోణాలు దాగి ఉన్నాయో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: