బీర్బల్ ఎంతో తెలివైన వాడు. తన తెలివితేటలు హాస్య చతురతలను ప్రదర్శించి, అక్బర్ కొలువులో స్థానం సంపాదించాడు. రోజు ఏదో ఒక తమాషా చేస్తూ అక్బర్ ను నవ్వించే వాడు. ఒకసారి బీర్బల్ తో నువ్వు ప్రదర్శించే హాస్య చతురత మమ్మల్ని ఎంతో ఆనందింపచేస్తోంది. పండగ పర్వదినాల్లో నిన్ను మనులు మాణిక్యాలతో సన్మానించాలని నిర్ణయించాం. అని సభాముఖంగా ప్రకటించాడు. అక్బర్ రోజులు గడిచిపోయాయి. పండగ వచ్చి వెళ్ళిపోయింది కానీ. బీర్బల్ నీ సన్మానించిన లేదు.. దాంతో బీర్బల్ ఎంతో నిరుత్సాహపడ్డాడు. ఎలాగైనా అక్బర్ ఈ విషయం గుర్తు చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు.


ఒకసారి అక్బర్ చక్రవర్తి ,బీర్బల్ ను తీసుకొని కోట బయట ఉన్న తోటలోకి షికారుకు వెళ్ళాడు. ఆ పక్క నుంచి ఒక  ఒంటె వెళ్తోంది. దానిమెడవంకరగా ఉండటం గమనించిన అక్బర్ ఈ ఒంటె మెడ ఎందుకు అంత వంకరగా ఉందో చెప్పగలవా..? అని బీర్బల్ ను అడిగాడు. అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషించిన బీర్బల్. బహుశా అది ఇచ్చినమాట నిలబెట్టుకో లేదేమో, జహాపనా అన్నాడు.  అర్థం కాలేదు కాస్త వివరంగా చెప్పు అన్నాడు. మహారాజా..ఇచ్చిన మాట నిలబెట్టుకోని వాళ్ల మెడ వంకర తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. మీరెప్పుడూ వినలేదా..?జహాపనా అన్నాడు.

ఎంతో వినయంగా.. ఈ మాట నేను ఎప్పుడూ వినలేదే భలే చిత్రంగా ఉంది. అనుకొని తను ఎవరెవరికి ఏయే వాగ్దానాలు చేశాడో గుర్తుకు తెచ్చుకున్నా డు. అక్బర్.. బీర్బల్ సన్మాన విషయం కూడా గుర్తొచ్చింది. అప్పుడు కానీ అక్బర్ కు అసలు విషయం అర్థం కాలేదు. నీ అంతర్యం అర్ధమయ్యింది. బీర్బల్ రేపు నీ సన్మానం ఏర్పాట్లు చేయిస్తాను. సమయస్ఫూర్తితో నా బాధ్యతను గుర్తు చేసినందుకు అభినందనలు అన్నాడు. అక్బర్ నవ్వుతూ.. ఇక నాటి నుంచి నేటి వరకు వాగ్దానాలు చేసిన ప్రతి ఒక్కరికి నెరవేర్చుకుంటారు వచ్చాడు అక్బర్. వాగ్దానం చేసే ముందు కూడా ఆలోచించి చేయడం ఉత్తమం..


మరింత సమాచారం తెలుసుకోండి: