చాలా కాలం క్రిందట ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఆ అడవికి మహారాజు అడవిలోని జంతువుల న్నింటికి రాజు అంటే మహా భయం. ఒకరోజు అది ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండగా ఒక లోతైన గుహ కనిపించింది. అప్పుడా సింహం గుహ లోనికి వెళ్లి అక్కడ ఎవరూ లేరని గమనించింది. ఇక్కడ కచ్చితంగా ఎవరో ఒకరు నివసిస్తూనే ఉంటారు. వాళ్లు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఎదురు చూస్తుంటాను. నాకి ఈరోజు రుచికరమైన భోజనం లభిస్తుంది. అని తనలో తాను అనుకుంటుంది. సాయంకాలానికి అక్కడ నివసించే గుంటనక్క ఆగుహాకి తిరిగి వచ్చింది.


ఆ గుంట నక్క గుహ బయట సింహం కాలి గుర్తులు చూసి బెదిరి పోయింది. అమ్మో ఇప్పుడు కనుక నేను లోపలికి వెళితే కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. సింహం కచ్చితంగా లోపలే ఉన్నదని నేను ఎలా తెలుసుకోవడం అని అనుకుంది గుంట నక్క, ధైర్యంగల గుంటనక్కకి ఒక ఉపాయం తోచింది. అప్పుడది గుహలోకి చూస్తూ గుహా అంటూ  గుంటనక్క  పిలిచింది. గొంతు విని సంతోషించింది సింహం, కానీ అది నిశ్శబ్దంగా ఉంది. గుంటనక్క మళ్లీ ఓ గుహ ఎందుకు నువ్వు ఈరోజు నిశ్శబ్దంగా ఉన్నావు. అంది గుంటనక్క..గుహను పిలవటం చూసి ఆశ్చర్యపోయింది సింహం. కానీ సింహం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది.


గుంట నక్క తిరిగి ఓ నా ప్రియమైన గుహ నీకు ఈరోజు  ఏమయింది ప్రతి రోజు నేను తిరిగి రాగానే పలకరించేదానివి.. నామీద నీకేమైనా కోపం వచ్చిందా..? నువ్వు మాట్లాడకపోతే నేను తిరిగి వెళ్ళిపోతాను. అంది గుంటనక్క ఓహో నేను తారపడక పోతే నా ఆహారం చేజారిపోతుంది. నాకు భయపడి కాబోలు ఈ గుహ నక్కకి సమాధానం ఇవ్వలేదు.. నేను దానికి సమాధానం చెప్పి లోపలికి పిలుస్తాను. అనుకుంది సింహం.. అంతే ఆ సింహం నోరు తెరిచి పెద్దగా గర్జించింది..సింహం ఏదో మాట్లాడే లోపే గుంటనక్క పరిగెత్తి పారిపోయింది. సరైన ఉపాయాన్ని ఆలోచించి , నటించి తన విలువైన జీవితాన్ని  రక్షించుకున్నందుకు ఆ గుంట నక్క తనకు తానే కృతజ్ఞతలు చెప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: