సింగమల అనే అడవిని కంటి అనే సింహం పరిపాలిస్తూ ఉండేది.. దానికి నక్క,కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటె ను చూశాను. దాన్ని వేటాడే గలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కని బయల్దేరేలా చేసింది. కానీ ఎడారిలో కి అడుగుపెట్టగానే.. ఇసుక వేడికి సింహం, నక్క ల కాళ్ళు బాగా కాలి అవి నడవలేక పోయాయి. దాంతో కాకి, ఒంటె దగ్గరకు వెళ్లి.. మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని.. మంత్రి నక్కనీ అడవిలో దించగలవా..! అని అడిగింది..


సరే అని ఒప్పుకున్న ఒంటె సింహాన్ని , నక్కను  మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తీసుకొచ్చింది.. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు. అంది ఒంటేతో.. సింహం ఉన్నఫలంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఒక ఉపాయాన్ని పన్నాయి.. మహారాజా.. కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు.. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము. కాబట్టి మమ్మల్ని తినండి అని అన్నాయి అది విన్న ఒంటె.. వాళ్లని వదిలేయ్ రాజా.. నన్ను చంపితే తిను..ముగ్గురికి వారం పాటు ఆహారంగా నేనూ కాగలను అంటూ ముందుకు వచ్చింది..


నక్క, కాకి..ఒంటె నోటి నుంచి ఆ మాట రావాలని నాటకమాడాయి  కాబట్టి సింహానికి అర్థమైపోయింది.. దాంతో సింహానికి అర్థమయ్యి..సరే ఒక్కొక్కరు వరుసగా రండి.. ముందు చిన్న జీవి తో మొదలు పెడతాను.. అంటూ.. కాకి ముందు నువ్వు రా అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటూ  పరుగు తీసుకుంది.నక్క అక్కడ నుంచి పరార్ అయ్యింది.  సింహం, ఒంటె  మాత్రం వాటి కపటబుద్ధి ని తెలుసుకొని ఆ రోజు నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: