అనగనగా ఒక ఊరు వుండేది.. ఆ వూరిలో ఒక పొలంలో రైతులు గోధుమలు పండించారు.. ఆ గోధుమ పొలంలో చాలాకాలం నుంచి ఒక ఎలుక నివసిస్తోంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్లి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఆ ఎలుక. ఓ రోజు ఆ పొలంలోకి ఒక మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది.మిడత అలా గోధుమలను తినటం చూసిన ఆ ఎలుక.. పొలంలో ఉన్న గోధుమలన్ని ఇదే తినేస్తే.. మరి నాకేం మిగులుతుంది. అని కంగారు పడింది.


వెంటనే ఆ ఎలుక మిడతతో.. 'ఏయ్ మిడత! ఎంత ధైర్యం నీకు... నా పొలానికే వస్తావా..? మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళిపో అని కోపంగా చెప్పింది.
అందుకు ఆ మిడత ఇంత మంచి  పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్లాలి? కావాలంటే నువ్వే పో అంటూ దురుసుగా సమాధానం చెప్పిందా మిడత.. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటనీ తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్రపట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలి. అని ఆలోచించింది..అప్పుడు  వడ్రంగి పిట్టకి ఆశ చూపింది ఎలుక..ఆ వడ్రంగి పిట్ట  కూడా సరేనంది.

మరునాడు పొలంలోకి ఆ మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఆ ఎలుక .. ఆ పక్కనే గట్టు మీద ఉన్న పిల్లి ఎలుకను చంపేసింది.. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా... మిడతే.. స్నేహంగా ఉంటే రెండు కలిసి తింటూ హాయిగా బతికేవి.. అసూయతో పంతానికి పోయి రెండూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నాయి. కేవలం క్రిమి కీటకాలు జంతువులు విషయంలోనే కాదు మనుషులు కూడా ఐకమత్యంతో జీవిస్తే ఎటువంటి సమస్యలు దరిచేరవు.. కాబట్టి ఏ సమస్య వచ్చినా కలిసి చేసుకుంటేనే సులభం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: