యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. ఇక చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మొదటి వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఆ తర్వాత 25 పరుగులు చేసిన డుప్లెసిస్ అవుటయ్యాడు. ఆ వెంటనే బ్యాటింగ్ కు వచ్చిన సురేష్ రైనా కూడా మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ 21 పరుగులు చేసి అవుటయ్యాడు. అలాగే అంబటి రాయుడు కూడా రెండు పరుగులకే క్యాచ్ రూపంలో వెనుదిరిగి నిరాశపరిచాడు. కానీ అప్పటివరకు నాటౌట్ గా ఉన్నా ఓపెనర్ గైక్వాడ్ బ్యాటింగ్ కు వచ్చిన జడేజాతో కలిసి వీరవిహారం చేశాడు. ఇక జడేజా 15 బంతుల్లోనే 32 పరుగులు చేయగా... 60 బంతుల్లో 5 సిక్స్ లు తొమ్మిది ఫోర్లతో ఐపీఎల్ లో తన మొదటి శతకాన్ని పూర్తి చేశాడు గైక్వాడ్. అయితే గైక్వాడ్ చెన్నై ఇన్నింగ్స్ లోని ఆఖరి బంతికి సిక్సర్ బాది 101 తో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు దాంతో చెన్నై తరపున శతకం బాదిన యువ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు గైక్వాడ్. ఇక అతని సెంచరీతో చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రాహుల్ తేవాటియా ఒక్కడే మూడు వికెట్లు తీయగా చేతన్ సకారియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకున్నా రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి వస్తుంది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తేనే రాజస్థాన్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. అయితే చెన్నైకి ఎదురుగా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం రాజస్థాన్ కు కష్టమే. చూడాలి మరి రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలిచి తమ ప్లే ఆఫ్ అవకాశాలను నిలబెట్టుకుంటుందా... లేదా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: