బూమ్ బూమ్ బూమ్రా.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఈ పేరు మార్మోగిపోతోంది. జస్ప్రిత్ బూమ్రా లో ఇలాంటి టాలెంట్ కూడా దాగి ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. బూమ్రా ఇలా ఎలా చేయగలిగాడు అని సీనియర్ ఆటగాళ్లు సైతం సైతం అవాక్కవుతున్నారు అనే చెప్పాలి. కెప్టెన్సీ చేపట్టాను  అన్న కొత్త ఊపో లేకపోతే ఇంకేదైనా ఉందో తెలియదు గానీ జస్ప్రిత్ బూమ్రా మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం ఇన్నాళ్ళు ఒక బౌలర్ గా మాత్రమే మనందరికీ తెలిసిన బుమ్రా తనలో ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ దాగి ఉన్నాడు అన్న విషయాన్ని ఇటీవల నిరూపించాడు.


 కెప్టెన్సీ ఎలా చేస్తాడో అని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నాడు అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపించాడు. ఏకంగా ఒకే ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు జస్ప్రిత్ బూమ్రా. అదికూడా మోస్ట్ సీనియర్ బౌలర్ అయిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో  ఈ ఫీట్ సాధించడం గమనార్హం. సిక్సర్లు ఫోర్లతో  టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ లాగా చెలరేగిపోయాడు జస్ప్రిత్ బూమ్రా. మొత్తంగా ఎక్స్ ట్రా లతో కలిపి ఇక 35 పరుగులు ఒకే ఓవర్లో అందుకున్నాడు బూమ్రా.


 అయితే బుమ్రా అద్భుతమైన గురించి తెలిసిన తర్వాత అబ్బా మేము ఎందుకు టెస్ట్ మ్యాచ్ చూడలేకపోయాము బాధపడుతున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు అని చెప్పాలి. బుమ్రా ఇంత అద్భుతంగా రాణిస్తాడు అని తెలిసి ఉంటే తప్పకుండా టెస్ట్ మ్యాచ్ చూసే వాళ్లం కదా అని అనుకుంటున్నారు ఎంతోమంది. ఒకవేళ మీరు కూడా ఇలా బూమ్రా సర్ ప్రైజింగ్ ఇన్నింగ్స్ చూడలేక నిరాశ పడుతూ ఉంటే మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్. బుమ్రా ఇన్నింగ్స్ చూడలేకపోయామని చింతించాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఇక బుమ్రా ఇన్నింగ్స్ కు సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్ లో  వైరల్ గా మారిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: