సాధారణంగా క్రికెట్లో 40 ఏళ్ల వయసు వచ్చింది అంటే చాలు ఇక సదరు ఆటగాడు ఏ క్షణంలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడో అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది క్రికెటర్లు కూడా 45 ఏళ్ల వయస్సు వచ్చిందంటే.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అంతకు ముందులాగా చురుకుగా రాణించలేక ఇక ఒక్కో ఫార్మాట్ నుంచి తప్పుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఒకేసారి మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం నేటి రోజుల్లో చూస్తూనే ఉన్నాము. అయితే ఒకవేళ నలభై ఏళ్ల వరకు కూడా కెరియర్ కొనసాగించిన కేవలం బ్యాట్స్మెన్లు మాత్రమే ఇలా చేయడం చూస్తూ ఉంటాం.


 ఎందుకంటే జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే అటు ఫాస్ట్ బౌలర్లకు కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు క్రికెట్ పండితులు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు 40 ఏళ్ళ పాటు గాయాల బెడద వేధించకుండా సక్సెస్ఫుల్గా కెరియర్ ని కొనసాగించడం అసాధ్యం అని అంటూ ఉంటారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ 40 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్రాడిలాగే రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్. 40 ఏళ్ళ ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా అతనిలో జోరు తగ్గలేదు అని ప్రతి మ్యాచ్ లో నిరూపిస్తున్నాడు.


 30, 35 ఏళ్ల వయసులోనే ఏదో ఒక ఫార్మాట్ కి ఆటగాళ్లు పరిమితం అవుతున్న నేటి రోజుల్లో.. అటు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మాత్రం ఇక మూడు ఫార్మట్లలో కూడా సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే న్యూజిలాండ్ తో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఏడు వికెట్లు తీసి ఏకంగా మ్యాచ్ విన్నర్గా మారిపోయాడు. ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ 267 పరుగులతో విజయం సాధించింది. మొత్తంగా 177 మ్యాచ్లలో  675 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఒకవైపు యంగ్ బౌలర్లు గాయాల బారిన పడుతున్న.. 40 ఏళ్ళ వయసులో ఇంకా ఫిట్గా ఉన్న జేమ్స్ అండర్సన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: