‘జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిన తర్వాత కానీ నేను ఆంధ్రాలో అడుగుపెట్టను’ ..ఇది కొద్దిరోజుల క్రితం రచ్చబండ కార్యక్రమంలో రాజుగారు అదేనండి నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజ చేసిన శపథం. జూమ్ యాపో లేకపోతే ఇంకదేనిలోనో వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు పదే పదే ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. వెనకనుండి నడిపించేవాళ్ళు ఎవరైనా తెరముందు కనబడుతున్నది మాత్రం తిరుగుబాటు ఎంపినే. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రత్యేకించి ఏదో ఓ సబ్జెక్టును సృష్టించుకుని మరీ బూతులు తిడుతున్నారు. సరే బూతులపర్వం అన్నీ హద్దులు దాటిపోవటంతో చివరకు సీఐడీ అధికారులు రాజుగారిని అరెస్టుచేశారు.




జగన్ను అరెస్టు చేసిన తర్వాత కానీ తాను రాష్ట్రంలోకి అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన రాజుగానే ముందు అరెస్టవ్వటం చాలా విచిత్రంగానే ఉంది. జగన్ అరెస్టు సంగతి తర్వాత ముందు రాజుగారైతే అరెస్టు కారణంగా రాష్ట్రంలోకి అడుగుపెట్టేశారు. ఎదుటివాళ్ళకు ఏమవ్వాలని కోరుకుంటామో మనకూ అదే జరుగుతుందని (కీడు విషయంలో) పెద్దలు ఎప్పుడో చెప్పారు.  ఆ విషయాన్ని మరచిపోయిన రాజుగారు 24 గంటలూ జగన్ జైలుకు వెళ్ళాలనే కోరుకున్నారు. కానీ చివరకు జరిగిందేమిటి ? ముందు రాజుగారే జైలుకెళ్ళారు. బెయిల్ రావటం ఖాయమనే చాలా కులాసాగున్నారు. కానీ హైకోర్టులో బెయిల్ పిటీషన్ను కొట్టేసి కొందికోర్టులోనే తేల్చుకోమని చెప్పారు. దాంతో రాజగారు ఒక్కసారిగా డ్రామాకు తెరలేపారని అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి తేల్చేశారు.




శనివారం ఎంపిని కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిసి కూడా పోలీసులు శుక్రవారం రాత్రి ఎంపిని చావగొడతారా ? ఏమో డౌటనుమానంగానే ఉంది వ్యవహారం. శుక్రవారం రాత్రి ఐదుగురు పోలీసులు తానున్న గదిలోకి వచ్చి కాళ్ళను కట్టేసినట్లు చెప్పారు. తర్వాత ఒకళ్ళు మామూలు లాఠీతోను మరోకళ్ళు రబ్బర్ లాఠీతోను కొట్టారట. దాంతో రెండు పాదల మీద వాతలు తేలిపోయాయని తిరుగుబాటు ఎంపి తన  పాదాలను చూపించారు. అసలు సమస్యకన్నా ఇపుడీ కొసరు సమస్యే పెద్దదైపోయింది.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శుక్రవారం రాత్రి పోలీసులు ఎంపిని కొట్టారనే అనుకుందాం. మరి అదే విషయాన్ని శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లకు చెప్పలేదు. తర్వాత కోర్టు విచారణలో కూడా చెప్పలేదు. మధ్యాహ్నం తనకు భోజనం తెచ్చిన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు. మధ్యాహ్నం హైకోర్టులో బెయిల్ పిటీషన్ కొట్టేసిన తర్వాత సాయంత్రం గుంటూరు సెషన్స్ కోర్టులో విచారణ మొదలవ్వగానే కొట్టినట్లు చెప్పారు. అంటే రాజగారి వ్యవహారం చూసిన తర్వాత ఎక్కడో తేడాకొడుతోందని అనిపించటం లేదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: