
నారా లోకేశ్ ను, టీడీపీ నేతలను పరామర్శించనిచ్చే అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది.. సింపుల్‌గా అయిపోయేది.. కానీ.. దీన్ని వైసీపీ సర్కారు నానా హంగామా చేసింది. వైసీపీ కార్యకర్తలు కూడా అదే సమయంలో రావడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సమయంలో పోలీసులు తెలుగుదేశం నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు యత్నించారు. అప్పుడే తోపులాట చోటు చేసుకుంది. నారా లోకేశ్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోనీ.. అక్కడితే ఇష్యూ అయిపోయిందా అంటే అదీ లేదు.. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నాయకులను అరెస్టు చేసి వెంటనే వదిలేస్తారు..కానీ.. నారా లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆయన్ను అనేక పోలీసు స్టేషన్లకు తిప్పారు. మొదట ప్రత్తిపాడు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తిప్పారు. పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు.. ఇలా చివరకు పెదకాకాని స్టేషన్‌కు తరలించారు.
ఇలా మొత్తం 7 గంటలు తిప్పి... ఆ తర్వాత విడుదల చేశారు. ఈ మొత్తం సీన్ అంతా తెలుగుదేశం అనుకూల మీడియా బ్రహ్మాండంగా హైప్ క్రియేట్ చేసింది. మొత్తానికి ఇలా జగన్ నారా లోకేశ్ ను హీరోను చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపించింది.