తెలంగాణలోనే అతి పెద్ద జాతర సమ్మక్క, సారలమ్మ.. రెండేళ్ల కోసారి జరిగే ఈ అతిపెద్దజాతరకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర పండుగైన మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మేడారం మహా జాతర తేదీలను జాతర పూజారుల సంఘం ప్రకటించింది.

 ఫిబ్రవరిలో 05.02.2020 న బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు,గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 06.02.2020 నాడు గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. ఫిబ్రవరి 07.02.2020 శుక్రవారం  నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 08.02.2020 శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుందని జాతర పూజారులు వెల్లడించారు.

 

అంటే ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే జాతర.. 8 వ తారీఖుతో ముగుస్తుందన్నమాట. ఐదు ప్రారంభం కానున్నా..అంతకు ముందు నుంచే అక్కడ సందడి నెలకొంటుంది. లక్షల సంఖ్యలో భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. ఈ జాతరను గిరిజనులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. మొక్కులు చెల్లించుకునేవారు.. బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: