సాయిబాబా ను కొలిచే ప్రతి ఒక్కరు... ఈ వ్రతం గురించి తప్పక తెలుసుకోవాలి. కోరిన కోర్కెలు తీర్చి, క‌ష్టాలను తొలగించి మంచి భవిష్యత్తును ప్రసాదించు  ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. సాయినాధుని క్షేత్ర‌మైన షిరిడీకి వెళ్లి అక్కడ బాబాను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని భావిస్తారు. సాయిబాబా కు ప్రీతికరమైన రోజుగా గురువారాన్ని చెబుతుంటారు. కాబట్టి ప్ర‌ధానంగా గురువారం పూట ఆయ‌న్ను ద‌ర్శిస్తే ఇంకా చాలా మంచిద‌ని, అనుకున్న‌వి వెంట‌నే నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు సాయిబాబా గుడికి వెళ్లి ఆయనను దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చమని వేడుకుంటారు.

అయితే  ఆ సద్గురు సాయినాధుని కృపకు నోచుకోవాలి అంటే..... గుడికి వెళ్లడం గురువారం ప్రత్యేక పూజలు చేయడం మాత్రమే కాదు... ప్రతిరోజు ఇంటిలో దేవుడి మందిరంలో సాయిబాబా ముందు దీపారాధన చేయాలి. నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా గురువారం నాడు ఆయన ఎంతో ప్రీతికరమైన హ‌ల్వా, కిచ్‌డీ, మిఠాయిలు, పూలు, పండ్లు, చపాతి వంటి నైవేద్యం సమర్పించి ఎత్తు శ్రద్ధగా పూజ పునస్కారాలు చేసి మన భక్తిని చాటుకోవాలి. ఏ సందర్భం లోనూ ఎటువంటి ఆ సమయంలోనూ.. దేవుని నిందించరాదు. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన ముందుగానే నిర్ణయించబడుతుంది.

కానీ మన ప్రవర్తించే తీరు, మన భక్తిశ్రద్ధలు, నడవడికను బట్టి జీవితంలో కష్టాలు రాసి ఉన్నప్పటికీ అవి సంతోషంగా మారుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి దేవుడిని గొప్పగా పూజించడం కాదు మనస్ఫూర్తిగా పూజించడం ముఖ్యం, అదేవిధంగా ఇతరుల పట్ల దయ, జాలి,కరుణ, స్నేహ భావాలను కలిగి ఉండాలి. ముఖ్యంగా సాయిబాబా ని కొలిచే వారు ఇవి తప్పక పాటించాలి. చిన్నపిల్లలపై అత్యంత ప్రేమను చూపించాలి. ఇలాంటివన్నీ పాటించడం ద్వారా ఆ సాయి బాబా కృపకు పాత్రులవుతారు. రేపు మీకు బాబాపై ఉన్న అభిమానాన్ని మరియు అపారమైన భక్తిని మీరు చేసే పూజల ద్వారా చూపండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: