హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుండి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. నిజానికి ఒక రకంగా దీనిని తెలుగు వారి మొదటి పండుగ అని చెప్పాలి. ఉగాది పండుగ రోజున కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అలాగే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.
తెలుగు వారి కొత్త ఏడాదిలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు..
ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.
మన శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి.
అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి.
సాధారణంగా ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అదే విధంగా బ్రహ్మ కు సంబంధించి, ఇంద్రుడికి సంబంధించిన ధ్వజారోహణం.
ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేస్తే మంచిది అని అంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ.. మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు.
ఉగాది పండుగ రోజు కచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉంది. అలాగే ఉగాది నుండి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
చేయకూడని పనులు :
ఉగాది పండుగ రోజు ఆలస్యంగా నిద్ర లేవ కూడదు. మాంసహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాత బట్టలు ధరించకూడదు అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించే అవకాశం ఉండదని చెబుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి