చాలావరకు మనుషుల కలలు వారిని సంతోష పరుస్తాయి. కొన్ని కలలయితే చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. మరి కొన్నయితే ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం. స్వప్న శాస్త్రం అలాంటివాటిని  స్వప్నాలు అని అంటుంది. మరి అలాంటి కలలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
 మాంసాన్ని ఉడికిస్తున్నట్టు కల వస్తే జీవితంలో విశేష లాభాలను సంపాదించి పెడుతుందట. మీరే మాంసాన్ని కట్ చేస్తున్నట్టు కల వస్తే మీకు వారసత్వ రూపంలో ఆర్థిక లాభాన్ని పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి.


కుళ్ళిన మాంసం కలలోకి వస్తే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయట. పాము మాంసం కలలోకి వస్తే అశుభసూచకం అని, పంది మాంసం అక్రమ మార్గాల నుంచి డబ్బును సూచిస్తుందట. కోడి మాంసం తిన్నట్టు కల వస్తే  మహిళలకయితే ఉపయోగకరమైన వార్తలు అందుతాయి. కలలో శంఖం కనిపించడం చాలా అరుదు. అలా కనిపిస్తే నారాయణుడు, లక్ష్మీదేవి కనిపించారని అర్థం. గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కల వస్తే ఎంతో శుభదాయకం. కలలో గాజులు ధరిస్తున్నట్టుగా కనిపిస్తే ఎలాంటి ఫలితాన్నిస్తుందో అనే సందేహం కలుగక పోదు. ఇలా కల వస్తే మాత్రం శుభసూచకం అని శాస్త్రమే చెబుతుంది. ఎగురుతున్న పక్షులు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి పక్షి రూపంలో కలలోకి వచ్చాడని అర్థం. పాము కాటేసినట్టు కల వస్తే మంచి జరుగుతుందని అర్థం. కొత్త బట్టలు కనిపిస్తే హాని అని,చనిపోయిన వారు కనిపిస్తే మంచిదంటుంటారు. కలలో పండ్ల బుట్ట కనిపిస్తే ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారని అర్థం. అలాగే స్త్రీకి ఆపిల్ తిన్నట్టు కల వస్తే పిల్లలు కలుగుతారట. జుట్టు కత్తిరించుకున్నట్టుగా కల వస్తే అప్పటివరకు మీకున్న సమస్యలు ముగుస్తాయట. కలలో ముంగీస కనిపిస్తే చాలా మంచిది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. చీర కట్టులో స్త్రీ కలలో కనిపిస్తే లక్ష్మీ దేవి దర్శనం ఇచ్చినట్టుగా అర్థం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. కలలో తమలపాకులు వస్తే సంతోషం, సంపద తో పాటు జీవితంలో సరికొత్త వెలుగొస్తుందని అర్థం చేసుకోవాలి. చంద్రుడు కలలో కనిపిస్తే జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా,సాఫీగా సాగిపోతుందని అర్థం.ఇక శృంగారానికి సంబంధించిన కలలు వస్తే మీరు చెడుగా అనుకోవాల్సిన పనిలేదు. వాటిని ఎవరైనా సరిగా విశ్లేషించుకుంటే తమకు చెందిన మానసిక భావాల గురించి, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారనే దాని గురించి, దేని గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాలను కూడా తెలుసుకోవచ్చట. ఆడైనా, మగైనా తమ మాజీ భాగస్వామి తో శృంగారంలో పాల్గొంటున్నట్లుగా కల వస్తే వారితో తమ బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని చూస్తుంటారట.

ఆ క్రమంలోనే అలాంటి కలలు వస్తాయట. గర్భంతో ఉన్నట్టు కలలు వస్తే అది శుభ సూచకం. ఎవరైనా జంట ప్రేమించుకున్నట్లుగా కల వస్తే అది కూడా మంచిదే. ఏదో ఒక విషయంలో విజయం సాధించబోతున్నారు అనడానికి అది సంకేతంగా వస్తుందట. అపరిచిత వ్యక్తుల తోని రతి క్రీడల్లో పాల్గొన్నట్టుగా కల వస్తే జీవితంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. తరుచుగా సంభోగం చేసినట్లుగా కలలు వస్తూ ఉంటే మీరు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేస్తున్నట్టు అర్థం. అదే కాదు అలాంటి నిర్ణయాన్ని చాలా రోజుల నుంచి అలాగే పెండింగ్ లో పెట్టేసిట్టుగా అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: