ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తి చేసిన భారత జట్టు.. ఈరోజు నుంచి ఆస్ట్రేలియాతో మొదటి టి20 సిరీస్ ప్రారంభం కానుంది.  కాగా నేడు మధ్యాహ్నం 1:40 నుంచి మొదటి టి20 ప్రారంభంకానుంది అన్న విషయం తెలిసిందే. ఈ టి 20 మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించి ఆస్ట్రేలియా కు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్ చేజార్చుకున్న భారత జట్టు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు కొన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 ముఖ్యంగా టీ20 సిరీస్ లో భారత ఓపెనర్లు గా రంగం లోకి దిగిపోయే  శిఖర్ ధావన్, కె.ఎల్.రాహుల్ లు  సరికొత్త రికార్డులపై కన్నేసినట్లు తెలుస్తోంది. 2019-20 సంవత్సరం లో ధావన్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కానీ ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా రాణించడంతో రెండవ టాప్ స్కోరర్గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. అయితే 61 టి20 లో 1588 రన్స్ చేసిన శిఖర్ ధావన్ 29 పరుగులు చేస్తే మహేంద్ర సింగ్ ధోనీ దాటేసే అవకాశం ఉంటుంది.



 మహేంద్ర సింగ్ ధోనీ 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు.. ఇక మాజీ క్రికెటర్ సురేష్ రైనా 1605 పరుగులు చేయగా.. ఒకవేళ మొదటి టి20 మ్యాచ్ లో శిఖర్ ధావన్ 18 పరుగులు చేస్తే సురేష్ రైనా ను కూడా వెనక్కి నెట్టేస్తాడు. అంతేకాదు భారత్ తరపున టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. 42 టి-20లో 1461 పరుగులు చేసిన కె.ఎల్.రాహుల్ ఇంకా 39 పరుగులు చేస్తే 1500 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. ఇక మరోవైపు ప్రస్తుతం టీ20 లో వికెట్లు పడగొట్టిన బౌలర్గా బుమ్రా  ఉండగా ఒక వికెట్ తేడాతో రెండో స్థానంలో చాహల్  ఉన్నాడు... చాహల్  కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: