గత ఏడాది చివర్లో ఐపీఎల్ ముగియగానే భారత జట్టు అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది  అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ లు  ఆడుతుంది భారత జట్టు. ఐతే ఆస్ట్రేలియా పర్యటనకు నేటితో తెరపడింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చివరిగా టెస్టు సిరీస్ ఆడుతున్న  భారత జట్టు.. చివరి టెస్ట్ సిరీస్ లో  చివరి మ్యాచ్ నేడు ముగియనున్నది. ఈ క్రమంలోనే నేడు చివరి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.



 ఇకపోతే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత జట్టు ఏ సిరీస్ ఆడుతుంది అన్న దానిపై ఆసక్తికరంగా మారిపోయింది. అయితే.. ఈ ఏడాది జూన్ లో శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ ఆడాల్సి ఉంది భారత జట్టు. కానీ ఆసియా కప్ లో పాల్గొనడంపై  ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.  జూన్ లో  శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ నుంచి భారత జట్టు వైదొలగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో బిసిసిఐ నిర్ణయం తీసుకోనుందట .



 కరోనా  వైరస్ కారణంగా గత ఏడాది చాలా టోర్నీలు  వాయిదా పడటం ఇక ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మక  సిరీస్ లు  ఉండడం వల్లనే ఆసియా కప్ నుంచి టీమిండియాను డ్రాప్ చేసేందుకు అటు బిసిసిఐ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బిసిసిఐ గనుక నిజంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ అది ఒక చేదు వార్త అనే చెప్పాలి.  ఎందుకంటే ఆసియా కప్ లో  పాకిస్తాన్ భారత్ జట్లు తలపడతాయి  అన్న విషయం తెలిసిందే.  ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే  క్రికెట్ ప్రేక్షకులకు ఎలాంటి మజా వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక వేల ఆసియా కప్ నుంచి భారత జట్టు తప్పుకుంటే ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులు చూడలేరు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: