ప్రస్తుతం భారత క్రికెట్లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ద్వారా తన క్రికెట్ కెరీర్ ని ప్రారంభించి మొదటి ఐపీఎల్ సీజన్ తోనే సెలక్టర్లనూ ఆకర్షించి భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.  ఇక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తనదైన శైలిలో రాణించి భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు జస్ప్రిత్ బూమ్రా. ఇక ప్రస్తుతం జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


 ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టులో జస్ప్రిత్ బూమ్రా స్థానం మాత్రం పదిలంగానే ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కీలక వికెట్లు పడగొట్టి ఇక జట్టును విజయతీరాలకు చేర్చడంలో జస్ప్రిత్ బూమ్రా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాడు. అంతేకాదు టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ గా కూడా జస్ప్రిత్ బూమ్రా కి మంచి పేరు ఉంది.  ఇప్పటివరకు ఎన్నో డెత్ ఓవర్లలో జస్ప్రిత్ బూమ్రా టీమిండియాకు విజయం అందించాడు. అయితే తన కెరీర్లో తాను అంచెలంచెలుగా ఎదిగడానికి.. తన బౌలింగ్ మెరుగుపడడానికి కారణం ఎవరు అనే విషయం పై ఇటీవల జస్ప్రిత్ బూమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తన కెరియర్ను అద్భుతంగా తీర్చి దిద్దడంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ పాత్ర ఎంతో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు జస్ప్రిత్ బుమ్రా . షేన్ బాండ్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వద్ద ప్రతి ఏడాది కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను అంటూ తెలిపాడు జస్ప్రిత్ బూమ్రా.  అయన సలహాలు తోనే తన బౌలింగ్ లో ఎప్పటికప్పుడు సరికొత్త అస్త్రాలను సంధించడానికి సిద్ధం గా ఉంటాను అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: