భారత క్రికెట్ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది తమ వంతు కృషి చేశారు. ఈ రోజు భారతీయులంతా గర్వంగా ఇండియన్ క్రికెట్ టీం ఈజ్ గ్రేట్ అని చెప్పుకుంటూ ఉందంటే దానికి కారణం వీరందరి కృషి, శ్రమ. అటువంటి వారిలో ఒక్కరే మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. టీం ఇండియాకి అపారమైన సేవలను అందించాడు. సౌరవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ మరియు రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం  కలవాడు.  ఇతని క్రికెట్ జీవితంలో ఎన్నో మలుపులు మరియు వివాదాలు ఉన్నాయి. మైదానంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతుంటాడు. గంగూలీని ముద్దుగా బెంగాల్ టైగర్, దాదా మరియు కోల్ కతా యువరాజుగా అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా గంగూలీ టెస్ట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. ఎన్నో అద్వితీయమైన విజయాలను ఒంటి చేత్తో ఇండియాకు అందించాడు. అయితే గంగూలీకి మొదటి టెస్టులో ఆడడానికి అంత ఈజీగా అవకాశం దక్కలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. అసలేమి జరిగిందో ఒకసారి చూద్దాం. అంతకు ముందు 1995 -96 దులీప్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో గంగూలీ అభేద్యంగా 171 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీనితో భారత క్రికెట్ జట్టు నుండి పిలుపు వచ్చింది. అదే సంవత్సరం ఒక్క వన్ డే మ్యాచ్ మాత్రమే ఆడిన గంగూలీకి, ఇంగ్లాండ్ తో జరగబోయే మొదటి టెస్ట్ లో చోటు దక్కలేదు.  

కానీ అనూహ్యంగా రెండవ టెస్ట్ లో ఒక వివాదం కారణంగా గంగూలీకి చోటు దక్కింది. దీనికి కారణం అప్పటి ఇండియన్ టీం కెప్టెన్ అజారుద్దీన్ తో నవజ్యోత్ సింగ్ సిద్ధుతో గొడవ కావడం వలన ఆ సిరీస్ నుండి సిద్దు తప్పుకున్నాడు. ఇక ఆ స్థానంలో మన బెంగాల్ టైగర్ గంగూలీకి ఓపెనర్ గా ఆడే ఛాన్స్ దక్కింది. ఈ టెస్టులోనే గంగూలీ అరంగేట్రంలోనే లార్డ్స్ గ్రౌండ్ లో సెంచరీ (131) సాధించాడు. ఇది ఇప్పటికీ రికార్డుగా ఉంది. ఈ విధంగా గంగూలీ కి ఒక వివాదం కారణంగా మొదటి టెస్ట్ ఆడే అవకాశం వచ్చింది. ఈ రోజు సౌరవ్ గంగూలీ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: