రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది..  పెరిగిపోతున్న టెక్నాలజీ ఎన్నో మార్పులకు కారణమవుతుంది. అయితే నేటి రోజుల్లో టెక్నాలజీ అన్ని రంగాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు తీసుకు వస్తుంది. ఈ క్రమంలోనే అధునాతన టెక్నాలజీతో పాటు క్రీడా రంగం కూడా ప్రస్తుతం మరింత ఆహ్లాదకరంగా మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా క్రికెట్ లో అయితే ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తూనే ఉంది.  ఇక ప్రస్తుతం  విషయంలో కూడా కచ్చితత్వంతో నిర్ణయం తీసుకునే విధంగా క్రికెట్ లో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ కోసం అటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఐపీఎల్ రెండవ దశ ను చూసి ఎంజాయ్ చేస్తూ ఉండగా ఐపీఎల్ ముగియగానే టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది.  ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమే  లక్ష్యంగా ప్రస్తుతం అన్ని దేశాల జట్లు కూడా సిద్ధం అయిపోతున్నాయి.  ఇక ఈ సారి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ మరింత ఖచ్చితత్వంతో మరింత కొత్తగా అందించేందుకు అటు ఐసీసీ కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తుంది అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే 20 ప్రపంచకప్ లో ఐసిసి ఈసారి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఈ కొత్త నిబంధనలతో టీ20 వరల్డ్కప్ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది   అయితే ఐసీసీ తీసుకు రాబోయే కొత్త రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  టి20 వరల్డ్ కప్ లో తొలిసారిగా డి ఆర్ ఎస్ విధానాన్ని అమలు చేయబోతుంది ఐసీసీ.  ఇక ఈ టిఆర్ఎస్  విధానం అమలులోకి వస్తే క్రికెట్ లో ఉత్కంఠ మరింత పెరిగే అవకాశం ఉంది.  వర్షం వల్ల సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే రిజర్వు డే అవకాశం కల్పించ పోతుంది ఐసీసీ.  ఇక సెమీ ఫైనల్ ఫైనల్ మ్యాచ్లో ఫలితం తేల్చేందుకు రెండు జట్లు కూడా కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ లీగ్ దశలో వర్షం వల్ల మాత్రం ఆలస్యం అయితే ప్రతి జట్టు కూడా 5ఓవర్లు ఆడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: