ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా ఈరోజు చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న భారత జట్టు పాకిస్తాన్ జట్టు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. దానికి బాబర్ ఆజమ్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం ఇప్పటికీ ఈ మ్యాచ్ కోసం జట్టును ప్రకటించలేదు. కానీ ఈ మ్యాచ్లో కొంతమంది ఆటగాళ్లకు షాక్ తగలనునట్లు తెలుస్తుంది.

ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ జోడిగా కేఎల్ రాహుల్ హిట్ మాన్ రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అలాగే తాను వన్ డౌన్ ఆటగాడిగా వస్తున్నట్లు కోహ్లీ క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఈ ఓపెనర్లు ఇద్దరు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తో జరిగిన వామప్ మ్యాచ్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. అలాగే ఐపీఎల్ లో కూడా వీరు తమ ఫామ్ కొనసాగించారు. మ్యాచ్ ముందు ఏదైనా గాయాల కారణంగా మినహాయించి ఈ  ఓపెనింగ్ జోడిలో ఎటువంటి మార్పు ఉండదు. వీరు జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తే ఆ తర్వాత వన్ డౌన్ లో వస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ దానిని కొనసాగిస్తాడు అనే నమ్మకం అందరికీ ఉంటుంది. అయితే కోహ్లీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో మొదట తడబడిన సూర్యకుమార్ చివర్లో ఆకట్టుకున్నాడు. అదే జోరు ఈ మ్యాచ్లో చూపిస్తాడు అని భావిస్తున్నారు.

ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను కొనసాగించనున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ లోయర్ ఆర్డర్ లో అంతగా రాణించడం లేదు. కాబట్టి పంత్ ను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యకు చోటు దక్కనున్నట్లు సమాచారం. అయితే పాండ్యను పూర్తి బ్యాట్స్మెన్ గానే జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ కు అవకాశం రానుంది. అయితే స్పిన్నర్ కోటలో ఉన్న వరుణ్ చక్రవర్తికి గాయం కావడం కారణంగా రవిచంద్రన్ అశ్విన్ స్థానం ఖరారయింది. దాంతో చాహల్ స్థానంలో వచ్చిన రాహుల్ చాహర్ కు చోటు దక్కడానికి అవకాశాలు లేవు. ఇక పేసర్లుగా బూమ్రా మొహమ్మద్ షమీ లను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దాంతో ఐపీఎల్లో అలాగే వామప్ మ్యాచ్లో ఆకట్టుకోని భువనేశ్వర్ కుమార్ కు కూడా ఈ జట్టులో చోటు దక్కే అవకాశం లేదు అనేది స్పష్టమవుతుంది. చూడాలి మరి ఈరోజు పాకిస్తాన్ పై భారత జట్టు ఆటగాళ్లు ఎలా రాణిస్తున్నారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: