గత నెలలో స్టార్ట్ అయిన పొట్టి ప్రపంచ కప్ లో ఇక మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో మొదటి సెమీఫైనల్ ఈ రోజు అబుదాబి వేదికగా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్ లో కప్ కోసం పోటీ పడనుంది. మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగనుంది. ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే అన్ని విభాగాల్లోనూ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ మాత్రం ఇంగ్లాండ్. ఇది ఇప్పటికీ క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జేత్తునే విఅజయ్మ్ వరిస్తుంది. మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

2019 వరల్డ్ కప్ లో ఓటమి ఇప్పుడు గుర్తుకొస్తోంది. అప్పుడు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జల్తా మధ్యన జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ లో చివరిలో ఇంగ్లాండ్ ను విజయం వరించింది. అందుకే ఈ సారి న్యూజిలాండ్ మళ్ళీ ఒక మంచి అవకాశం దొరికింది. ఈ మ్యాచ్ లో గతంలో ఓటమికి ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా అని తమ జట్టు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్ గత మ్యాచ్ లో ఆడిన జట్టుతో బరిలోకి దిగనుండగా, ఇంగ్లాండ్ మాత్రం గాయంతో టోర్నీకి దూరమైన ఓపెనర్ జాసన్ రాయ్ కి బదులుగా సామ్ బిల్లింగ్స్ ను జట్టులోకి తీసుకుంది.

అబుదాబి పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 180 పరుగులు చేస్తేనే ఢిపెండ్ చేయగలదు. కానీ న్యూజిలాండ్ బౌలింగ్ ను తట్టుకుని అన్ని పరుగులు చేయగలదా అన్నది చూడాలి. అంతే కాకుండా స్పిన్నర్ సౌదీ మరియు మిచెల్ శాంట్నర్ ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు. అదే విధంగా మంచి ఫామ్ లో ఉన్న బట్లర్, బైర్ స్టో, లివింగ్ స్టోన్ లను అడ్డుకోవడం కష్టమేనని తెలుస్తోంది.

 



మరింత సమాచారం తెలుసుకోండి: