ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈ ఏడాది ప్రేక్షకుల అందరి అంచనాలు కూడా తారుమారయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఏడాది అద్భుతంగా రాణించి జట్లు ఇక ఈ ఏడాది మాత్రం పేలవమైన ప్రదర్శన కొనసాగించాయి  అదే సమయంలో గత ఏడాది వరకు పేలవమైన ప్రదర్శన కారణంగా పాయింట్ల పట్టికలో చివరన ఉంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న జట్లు ఇప్పుడు ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి  గత ఏడాది వరకూ వరుస ఓటమిలూ చవిచూసిన రాజస్థాన్ రాయల్స్.. ఇక ఈ ఏడాది మెగా వేలం కారణంగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో ఎప్పుడూ అగ్రభాగం లోనే కొనసాగుతూ వచ్చింది. ఇకపోతే ఇక ఇటీవలే ప్లే ఆప్ లో అడుగుపెట్టిన మూడవ జట్టుగా కూడా రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతోన్న చాహల్ అదరకొడుతున్నాడు.. మొన్నటి వరకు ఫాం లేమి కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న యుజ్వేంద్ర చాహల్ ఈ ఏడాది మాత్రం జట్టులో కీలక సమయంలో వికెట్లు తీస్తూ ఆదరగొట్టేస్తున్నాడు.


 ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 14 మ్యాచుల్లో ఏకంగా ఇరవై ఆరు వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆప్ కి చేరడంలో కీ రోల్ పోషించాడు అని చెప్పాలి. ఇక ఈ సారి అత్యధిక వికెట్లు తీసింది కూడా చాహల్ కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్ గా చాహల్ రికార్డు సృష్టించాడు. ఇక ఆ తర్వాత 24 వికెట్లతో హర్భజన్ సింగ్ ఉండగా ఇక మూడవ స్థానంలో కూడా 23 వికెట్లతో  చాహల్ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: