ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ఎంత రసవత్తరం గా మారి పోయింది. ఈ క్రమం లోనే ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ చేరుకున్న రెండు జట్లు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ తల పడ్డాయి. కాగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే.. వారు అటు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతున్నారూ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఓడిన వారు నేరుగా ఇంటి బాట పడతారు అని చెప్పాలి. అయితే ప్రతి జట్టును ముందుకు నడిపించడానికి కెప్టెన్ ఎంతో ముఖ్యం.


 కెప్టెన్ అంటే కేవలం తన వ్యూహాల తో జట్టు లోని ఆటగాళ్లు అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిపించడమే కాదు  జట్టు విజయానికి కూడా ఎప్పుడూ పాటు పడుతూ ఉండాలి. జట్టులో ఉన్న ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా వీరోచిత పోరాటం సాగిస్తూ ఇక అందరి మన్ననలు పొందుతూ ఉండాలి. ఒక రకంగా జట్టు కెప్టెన్ అంటే సైన్యాధ్యక్షుడు తో సమానం. సైన్యాధ్యక్షుడు  ఎంత సమర్థవంతం గా సైన్యాన్ని ముందుకు నడిపిస్తాడో.. అలాగే ఇక కెప్టెన్ కూడా బాధ్యత నెరవేర్చాలి.


 మరి ఇలా కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకుని ఏకంగా జట్టు లో కీలక ఆటగాడిగా కొనసాగి మంచి ప్రదర్శన తో ఆకట్టుకున్న వారు ఎవరు ఇప్పుడు  తెలుసుకుందాం.. కేఎల్ రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్గా ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 537 పరుగులు చేశాడు.  హార్థిక్ పాండ్యా గుజరాత్ జట్టు కెప్టెన్గా 453 పరుగులు చేశాడు. డుప్లేసెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా 443 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ కి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా 421 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కోల్కతా కెప్టెన్గా 401 పరుగులు చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: