ఇప్పటికే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది. ఇక విదేశీ గడ్డపై ప్రాక్టీస్ లో మునిగితేలుతోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్ జట్టుతో సిరీస్ ప్రారంభించబోతుంది. ఓకే టెస్ట్ తో పాటు ఏడు మ్యాచ్ లలో ఈ పర్యటనలో   ఇంగ్లాండ్ తో తలపడుతుంది టీమిండియా.  జూలై 1వ తేదీ నుంచి టెస్ట్  ప్రారంభమవుతుంది. ఇక గతంలో కరోనా కారణంగా రద్దు అయిన టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే టి20  వన్డే సిరీస్ ఆడబోతున్నాయి ఇంగ్లాండ్ టీమిండియా జట్లు. ఇక వచ్చే నెల 7వ తేదీ నుంచి టి 20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇక జూలై 12 వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.


 అయితే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా షాక్ తగిలింది అని తెలుస్తోంది. టీమిండియాలో  కీలక ఆల్ రౌండర్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. టీమిండియా తో కలిసి అతను ఇంగ్లాండ్ బయలుదేర లేదు అనేది తెలుస్తుంది. అయితే ఇలా భారత్లోనే అశ్విన్ ఉండిపోవడానికి కారణం కరోనా వైరస్ బారిన పడటమే.  ఇటీవల అతనికి ఆర్ టి పి సి ఆర్  నిర్వహించగా పాజిటివ్  వచ్చింది. దీంతో అందరితోపాటు ఇంగ్లాండ్ వెళ్లకుండా అతడు క్వారంటైన్ లో గడపాల్సి వచ్చింది.


 దీంతో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టు మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది.. అయితే జూలై 1వ తేదీన మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అశ్విన్ కోలుకుంటాడని బిసిసిఐ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అటు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ల ఆధ్వర్యంలో ఈ ప్రాక్టీస్ జరుగుతుంది. ఇటీవలే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా టీమిండియాతో చేరిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: