సాధారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది బాటర్లు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ అటు బౌలర్లతో చెడుగుడు ఆడేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి ఇన్నింగ్స్ ని చూడటానికి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో ఏదైనా భారీ సిక్సర్ నమోదయిందంటే చాలు అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇక భారీ సిక్సర్ కు  సంబంధించిన వీడియో అటు క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని మొత్తం ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో గాని లేదంటే ద్వైపాక్షిక సిరీస్ లో గాని 115 మీటర్ల సిక్స్ వెళ్ళింది అంటే చాలు ప్రతి ఒక్కరు దానిని భారీ సిక్సర్ గా అభివర్ణించడం  లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో భారీ సిక్సర్ అంటే  దాదాపు 120 మీటర్లవరకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో భారీ సిక్సర్ రికార్డు ఎవరీ పేరిట ఉంది  అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.


 అయితే ఇలా ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో బిగ్గెస్ట్ సిక్సర్ రికార్డు అటు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది పేరిట ఉంది అని చెప్పాలి. ఏళ్లు గడుస్తున్న ఈ రికార్డును మాత్రం ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. 2013లో సౌత్ ఆఫ్రికాలోని జోహేన్నస్ బర్గ్  స్టేడియంలో ఏకంగా షాహిన్ ఆఫ్రిది 153 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్లో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్లలో ఎవరు కూడా ఇక ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. కనీసం ఈ రికార్డుకు చేరువలోకి కూడా వెళ్లలేకపోయారు అని చెప్పాలి. రానున్న రోజుల్లో అయినా ఎవరైనా బ్యాట్స్మెన్ ఈ భారీ సిక్సర్ రికార్డును బ్రేక్ చేస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: