
ఇలాంటి గడ్డు పరిస్థితులనుంచి బయటపడిన విరాట్ కోహ్లీ ఇక ఆ తర్వాత మునుపటి ఫామ్ అందుకున్నాడు అని చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వరుసగా సెంచరీలు చేస్తూ మళ్ళీ రికార్డుల వేట ప్రారంభించాడు విరాట్ కోహ్లీ. అయితే పరిమిత ఓవర్లు ఫార్మాట్లో అయితే బాగా రాణించడం మొదలు పెట్టాడు. కానీ ఇక సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో మాత్రం విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. చాలా ఇన్నింగ్స్ ల నుంచి కనీసం విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి అర్థ సెంచరీ కూడా రాకపోవడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.
అయితే ఎట్టకేలకు ఇటీవల ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి అభిమానులు అందరిని కూడా సంతోషంగా మునిగిపోయేలా చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు అని చెప్పాలి. అంతకు ముందు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో కూడా భారీ స్కోర్లు చేయడంలో విఫలమైన కోహ్లీ.. ఇక నాలుగో టెస్ట్ లో మాత్రం కాస్త గాడిన పడినట్లు తెలుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని 59పరుగుల వద్ద కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఇన్నింగ్స్ ను ఎక్కడ వరకు కోహ్లీ తీసుకువెళ్తాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.