క్రికెట్లో స్టార్ ప్లేయర్లు గా కొనసాగుతున్న వారు రికార్డులు సృష్టించడం అనేది సర్వ సాధారణం అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది క్రికెటర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎప్పుడు ఏదో ఒక రికార్డు కొల్లగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎవరైనా క్రికెటర్ ఇలాంటి అరుదైన రికార్డులు సాధించాడు అంటూ చాలు ఇక వారి పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఎంతోమంది ఇక అదే విషయంపై చర్చించుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఇటీవలే బంగ్లాదేశ్ జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న తమిమ్ ఇక్బాల్ సైతం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు సాధించాడు. దీంతో ఇక ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అతని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం తమిమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ జట్టుకి వన్డే ఫార్మాట్లో కెప్టెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి జట్టుకు కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా అతను సక్సెస్ అవుతున్నాడు. అతని నాయకత్వ ప్రతిభతో ఎంతోమందిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ ఇటీవల తన కెరీర్లో ఏకంగా 15000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఈ మైలురాయిని అందుకోలేకపోయాడు. దీంతో ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా తమిమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. ఐర్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో 14 పరుగుల వద్ద ఇక ఈ మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో 5082, వన్డే ఫార్మాట్లో 8169, టి20 ఫార్మాట్లో 1758 పరుగులు చేశాడు తమిమ్ ఇక్బాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: