
ఊహించిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు అంబానీ లాభ పడ్డాడు అని చెప్పాలి. ఇటీవలే ఐపిఎల్ 2023 ప్రారంభమైంది. ఐపీఎల్ మొదలైంది అంటే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ స్టేడియం కు వెళ్లలేరు. అలా అని టీవీ ముందు కూర్చోలేరు. ఇక ఆఫీసులకు వెళ్లినవారు మొబైల్ లో లైవ్ లో మ్యాచ్ వీక్షించాలని అనుకుంటారు. ఈ క్రమం లోనే కొంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే జియో సినిమా డౌన్లోడ్ చేసి ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు అవకాశం కల్పించాడు. ఇంకేముంది ఉచితం అనే మాట వినిపిస్తే చాలు ఆ అవకాశాన్ని వాడుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. దీంతో ఇక జియో సినిమా యాప్ ను కేవలం గంటల వ్యవధి లనే 2.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో భారత్ లో ఒక్క రోజు లోనే అత్యధికం గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న యాప్ గా జియో సినిమా రికార్డు సృష్టించింది. దీంతో ఇక ముఖేష్ అంబానీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది.