కేవలం ఒకే ఒక్క సీజన్ కి బెంగళూరు తో జట్టు కట్టిన జయదేవ్ ఆ తర్వాత 2014 సీజన్ కి గాను ఢిల్లీ డెవిల్స్ జట్టుకు మారిపోయాడు. ఢిల్లీ తో రెండు ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత జయదేవ్ 2017 లో పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పూణే జట్టుతో కూడా ఒకే ఒక సీజన్ కి ఆడిన తర్వాత జయదేవ్ 2018లో రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు. ఈ చెట్టులో చేరిన తర్వాత జయదేవ్ రాజస్థాన్ రాయల్స్ కి ఒక కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు మంచి ఫామ్ లో ఉండి ఆ జట్టు రాణించడంలో కీలక పాత్ర పోషించాడు దాంతో నాలుగేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తోనే కొనసాగాడు.
నాలుగేళ్ల పాటు రాజస్థాన్ జట్టు జయదేవ్ రిటన్ చేసింది. ఆ తర్వాత 2022లో జయదేవ్ మరోసారి జట్టు మారిపోయాడు. రాజస్థాన్ రిలీవ్ చేసిన వెంటనే మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధిక డబ్బుతో జయదేవ్ ని కొనుగోలు చేసింది. కానీ ముంబై ఇండియన్స్ జట్టుకి పెద్దగా ఉపయోగపడలేదు అతడు సరైన ఫామ్ లో లేకపోవడంతో ఒక ఎడాది తర్వాత ముంబై అతడిని వదిలేసింది ఆ తర్వాత లక్నో జట్టు వేళలో జయదేవ్ ని కొనుగోలు చేసింది. ఈ విధంగా అత్యధికంగా ఏడుసార్లు జట్టు మారిన ఆటగాడిగా జయదేవ్ రికార్డు సృష్టించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి