2023 ఐపీఎల్ సీజన్లో అయినా అద్భుతంగా రానుంచి కప్పు గెలుస్తుంది అనుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానుల ఆశలకు తెరపడింది. ఎందుకంటే వరుస ఓవటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ ప్రస్థానం దాదాపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో ముగిసింది. అయితే ఇంకా సన్రైజర్స్ మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నప్పటికీ ఆ మ్యాచ్లలో విజయం సాధించిన ఓడిపోయిన పెద్దగా జట్టుకు ఉపయోగం ఏమీ లేదు. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో ఈసారి కూడా కప్పు పిలవాలన్న కలగానే మిగిలిపోయింది. కెప్టెన్ మారిన జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదు.



 అయితే కనీసం ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న తర్వాత అయినా స్వేచ్ఛగా ఆడి జట్టు విజయం సాధిస్తుంది అనుకుంటే ఆ సంతోషం కూడా అభిమానులకు లేకుండా పోయింది.  ముఖ్యంగా జట్టును ఛాంపియన్గా నిలుపుతాడు అని నమ్మకం పెట్టుకుని కెప్టెన్సీ అప్పగించిన మర్కరమ్ జట్టుకు పూర్తిగా భారంగా మారిపోయాడు. కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడంలోనే కాదు ఇక ఆటగాడిగా మంచి ప్రదర్శన చేయడంలోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం కేవలం పది పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు ఈ కెప్టెన్.



 ఇప్పుడు వరకు 10 మ్యాచ్లు ఆడిన మార్కరమ్ కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 50 పరుగులే. ఇక మార్కరమ్ కెప్టెన్సీలో 10 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో కొంతమంది సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సహనం కోల్పోతున్నారు. మార్కరమ్ కు కెప్టెన్సీ ఇచ్చి సన్రైజర్స్ తప్పు చేసిందని..సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజంగా మహానుభావుడివి సామీ.. కెప్టెన్సీలో కప్పు గెలిపిస్తావ్ అనుకుంటే.. చివరికి నిరాశ మిగిల్చావు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl