ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ ప్రారంభం నుంచి కూడా ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ధోని కెప్టెన్సీ లోనే బరిలోకి దిగిన చెన్నై జట్టు.. ఐపీఎల్ లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇక ప్రతి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.


 అంతేకాదు మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే అత్యుత్తమ గణాంకాలను  కూడా నమోదు చేసింది. ఎక్కువ సార్లు ఫైనల్ వెళ్లిన టీం గా.. ఇక ఎక్కువ సార్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ ఒకానొక సమయంలో ఇక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో అన్ని జట్ల కంటే ఎక్కువ ప్రేక్షకాదరణ  కలిగిన చెన్నై సూపర్ కింగ్స్.. రెండు సీజన్లలో ఐపీఎల్ నుంచి నిషేధించబడింది. దీనికంతటికి కారణం ఆయా జట్ల ఫ్రాంచైజీ  లో ఉన్న కొంతమంది అధికారులు స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడటమే.



 చెన్నై జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఇలా రెండేళ్లపాటు నిషేధాన్ని ఎదుర్కొంది. అయితే ఇక రెండేళ్లు నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టిన సమయంలో చెన్నై జట్టు కెప్టెన్ ధోని ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటూ చెన్నై మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. రెండేళ్ల నిషేధం తర్వాత 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆరోజు టీం డిన్నర్ లో ధోని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదని అనుకుంటున్నా.. నిజమే కదా అని హర్భజన్ ఇమ్రాన్ తాహీర్ ను అడిగితే.. అవును ఆ సమయంలో అక్కడ నేను కూడా ఉన్నాను అంటూ సమాధానం చెప్పాడు ఇమ్రాన్ తాహీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl