
ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఇక బాలయ్య కూతురు పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటించింది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని ఒక సునితమైన అంశంపై కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఎంతో మంది చిన్న పిల్లలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి స్పష్టంగా ఈ సినిమాలో చెప్పారు. ఇక ఈ కాన్సెప్ట్ను తీసుకోవడం పై ప్రస్తుతం అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందించాడు
బ్యాడ్ టచ్.. గుడ్ టచ్ పై అటు అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ సినిమా ద్వారా సాధ్యమైంది అంటూ ట్విట్ చేశాడు. ఇతర మీడియా ద్వారా ఈ పని చేయాలంటే మరో 10 ఏళ్ళు పడుతుందేమో అంటూ కామెంట్ చేశాడు. ఈ సినిమా ద్వారా అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన బాలకృష్ణ అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పాడు రాహుల్ రవీంద్రన్ . ఈ ట్విట్ కి యాంకర్ అనసూయ రీ ట్విట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సార్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ మూవీకి అటు థియేటర్లో రోజు రోజుకి మరింత పాసిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి.