క్రికెట్ లో ఉన్న రూల్స్ విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది ఊహించని రీతిలో అవుటైన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. కాగా గతంలో ఇలా మన్ కడింగ్ విషయంలో కొంతమంది బ్యాటర్లు అవుట్ అయ్యారు. ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అరుదైన రీతిలో అవుట్ అయ్యాడు. దీంతో ఇలా అవుట్ అవ్వడం ద్వారా కూడా అతను ఒక చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, బాంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ రూపంలో పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్లో మాథ్యూస్ ను అంపైర్లు ఈ విధానంలో అవుటుగా ప్రకటించారూ. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ పద్ధతిలో అవుట్ అయిన తొలి క్రికెటర్గా నిలిచాడు మాథ్యూస్. సాధారణంగా అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత మరో బ్యాట్స్మెన్ 3 నిమిషాల్లోగా క్రీజూలోకి వచ్చి మరో బంతిని ఎదుర్కోవాలి. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని వరల్డ్ కప్ లో రెండు నిమిషాలకు కుదించారు. ఆ సమయంలోగా మాథ్యూస్ క్రీజ్ లోకి రాకపోవడంతో ఇక బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేయగా అంపైర్లు టైమ్డ్ ఔట్ గా ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి