ఇక అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా ఈమె పారితోషకం అందుకునేవారు అంటూ వార్తలు కూడా వచ్చేవి అని చెప్పాలి అయితే ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని తన కెరీర్ గురించి ఇక ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో ప్రతి విషయం నేర్చుకోవాలని ఆసక్తి ఉండేది. ఇక ప్రతి విషయంలోనూ గోల్డ్ మెడల్ కావాలి అన్నట్లుగా ఆలోచించాను. ఇక తన నటనను సెట్ లోనే కాదు ప్రేక్షకులు కూడా మెచ్చుకోవాలని కోరుకునేదాన్ని. కానీ ఆ తర్వాతే పరిణితి చెంది అనుకున్నవన్నీ జరగవు అని అర్థం చేసుకున్న.
ప్రతిసారి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావు అనే విషయం అర్థమైంది అంటూ తెలిపింది. ఇక ఇప్పటి తరం హీరోయిన్లతో పోల్చి చూస్తే మీ తరం హీరోయిన్లు ఎలా ఉండేవారు అంటూ ప్రశ్నించగా.. మేము ఇప్పటి వాళ్ళంతా తెలివైన వాళ్ళం కాదు. నటన మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు హీరోయిన్లు కు మాత్రం స్కిన్ కేర్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ ల నుంచి వాయిస్ మాడ్యులేషన్ వరకు అన్నీ తెలుసు. మేము నటించేటప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లాంటివి లేవు. అయితే ఈ తరం హీరోయిన్లకు ఏది హిట్ అవుతుందో తెలుసు. ప్రేక్షకులు ఏది మెచ్చుకుంటారో తెలుసు. మాకు అవి ఏమీ తెలిసేవి కాదు. ఒక రకమైన పాత్రలు వస్తుంటే ఏదైనా కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళం అంతే అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు హీరోయిన్ల దురదృష్టం ఏంటంటే స్త్రీ పురుష పాత్రల్లో సమానత్వం లేదు ఒకప్పుడు ఉండేది అంటూ చెప్పుకొచ్చింది సుహాసిని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి