దాదాపు నెలన్నర రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులు అందరిని కూడా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచులు జరగబోతున్నాయ్.అయితే ఇలా ఐపీఎల్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎవరు ఈసారి టైటిల్ విజేతగా నిలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాలు మధ్య తప్పకుండా టైటిల్ గెలుస్తాము అనే నమ్మకంతో బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ చివరికి కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగు పెట్టలేక టోర్నీ నుంచి నిష్క్రమించాయ్. దారుణంగా నిరాశపరిచాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే చెత్త ప్రదర్శనలతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కున్నాయి. అయితే ఈ సీజన్లో ఇలా దారుణమైన ప్రదర్శన చేసిన జట్లలో అటు పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్క ఐపీఎల్ టోర్నీలోనే ముగ్గురు ఆటగాళ్ల కెప్టెన్సీలో మ్యాచ్లు ఆడింది.


 ఎక్కడ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు దారుణమైన ప్రదర్శన పై తీవ్రస్థాయిల విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు చేరకుండానే లీఫ్ దర్శనం నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించిన పంజాబ్ జట్టు వరుసగా పదేళ్లపాటు ప్లేయర్స్కు దూరమైన జట్టుగా నిలిచింది. 2014లో ఫైనల్స్ లో చేరి కేకేఆర్ పై ఓడింది  పంజాబ్. ఇక అప్పటినుంచి ఆ జట్టుకు అస్సలు కలిసి రావడం లేదు. రాత కూడా మారడం లేదు  ఈ సీజన్ లో ఐదు మ్యాచ్లో గెలిచి నాకౌట్ చేరకుండా తప్పుకుంది  అయితే ఆ జట్టు అయిదు సార్లు చివరి ఓవర్ లో ఓడిపోయింది. విజయ అవకాశాలు తమ వైపే ఉన్న మ్యాచ్లలో సైతం ఓటమిపాలు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: