ఐపీఎల్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో అత్యంత రసవత్తరంగా జరిగింది. 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ట్రోఫీ గెలుచుకుని చరిత్ర సృష్టించగా, పంజాబ్ కింగ్స్ మాత్రం ఓ గోల్డెన్ ఛాన్స్‌ను చేజార్చుకుంది. ఆఖరి వరకు గుండెలు వణికించే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో కొంతవరకూ కట్టుదిట్టమైన ప్రదర్శన చేసి, ఆఖరి ఓవర్లలో బెంగళూరు స్కోర్‌ను తగ్గించగలిగారు. పంజాబ్ కింగ్స్ జట్టు ఛేజ్ మొదలులో దూకుడు చూపినప్పటికీ, మిడిల్ ఓవర్లలో పెద్ద డెబ్బలు తగిలాయి. ముఖ్యంగా, నేహాల్ వధేరా నెమ్మదిగా ఆడడం పంజాబ్‌కు ప్రధాన గండంగా మారింది. 8 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా కేవలం 15 పరుగులే చేయడం, పంజాబ్ రన్ రేట్‌ను బాగా దెబ్బతీసింది. ఇక శ్రేయాస్ అయ్యర్, స్టాయినీస్ రెండు బంతుల్లోనే అవుట్ కావడం మ్యాచ్‌ ను ఆర్సీబీ దిశగా మళ్లించింది.

ఈ కష్టసమయంలో శశాంక్ సింగ్ ఒక్కడే జట్టు కోసం అసాధ్యాన్ని సాధ్యంగా చేయడానికి ప్రయత్నించాడు. తన సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా, చివరి బంతి వరకూ ధైర్యంగా నిలిచాడు. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచి చివరి వరకు పోరాడాడు. ఆయన ఇన్నింగ్స్ వల్లే పంజాబ్ చివరి వరకూ పోటీ ఇచ్చింది. ఇకపోతే, వధేరా 18 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి జట్టు గెలుపు అవకాశాన్ని దెబ్బతీశాడు. 17వ ఓవర్‌లో భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుటయ్యే వరకు, పూర్తిగా డిఫెన్సివ్ బ్యాటింగ్ ఆడటం పంజాబ్ విజయాన్ని మరింత కష్టతరం చేసింది.

ఈ మ్యాచ్‌ తో శశాంక్ సింగ్ పేరు ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. ఓ ఫైనల్ మ్యాచ్‌లో ఒక్కడే ఫైటింగ్ ఇన్నింగ్స్‌తో తన విలువను చాటాడు. బ్యాటింగ్‌లో స్థిరత, ఆత్మవిశ్వాసంతో నిండిన శశాంక్ ఆటతీరుపై అభిమానులే కాదు, క్రికెట్ విశ్లేషకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్ భారత జట్టుకు ఇదే కాబోయే బ్యాటింగ్ హోప్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఓటమి వల్ల పంజాబ్ ఫ్యాన్స్ నిరాశ చెందినా, శశాంక్ పోరాటం మాత్రం నిండా గౌరవం పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: