బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేము. కొన్నిసార్లు ఎంత స్నేహంగా ఉన్న వారైనా ఎదో ఒక సందర్భంలో గొడవలు పెట్టుకుంటారు. అలాగే ఎంత బద్ర శత్రువులైనా కలసి కట్టుగా ఒదిగిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని అర్దం చేసుకుంటారు. మొదటి నాలుగు సీజన్లలో అలాంటి సందర్భాలు ఎన్నో సార్లు చూశాం. ఇదిలా ఉంచితే ఇలాంటి సీన్ ఒకటి సీజన్ 5 లో రిపీట్ అయ్యింది. సీజన్ 5 మొదలయినప్పటి నుంచి జశ్వంత్, షణ్ముఖ్, సిరి లు ఒక గ్రూపు గా ఫామ్ అయ్యి ఎంత స్నేహంగా వుంటున్నారో తెలిసిందే. ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో ఒక బెడ్ కూడా షేర్ చేసుకుంటున్నారు ఈ స్నేహితులు. గత ఆరు వారాలు నుండి ఎంతో స్నేహంగా వెళ్తున్న వీరి మధ్య బిగ్ బాస్ అగ్గిరాజేసాడు.

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కాస్త వీరి స్నేహ బంధానికి బీటలు వారేలా చేసింది. బంగారు కోడిపెట్ట ఇంటి సభ్యులను కుదురుగా ఉండడనివ్వడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో షన్ను, జెస్సి, సిరిలను మీ పిచ్చి స్నేహం వద్దంటూ ఫైర్ అయ్యాడు. జశ్వంత్ కి బిగ్ బాస్ దొంగలించి ఈ ముగ్గురి బాస్కెట్ లలో జీరో ఎగ్స్ ఉండేలా చేయాలని సూచించారు. అందుకు తనకు ఓ వ్యక్తి సాయం తీసుకోవచ్చు అని తెలిపారు. దాంతో జశ్వంత్, సిరి సహాయం తీసుకుని సీక్రెట్ గేమ్ ను ఆడాడు. ఈ క్రమంలో షన్ను దగ్గరున్న గుడ్లను తీసుకోగా షన్ను సైలెంట్ గా ఇచ్చేసాడు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో సీక్రెట్ టాస్క్ విషయం కాస్త రివీల్ అవడంతో జెస్సి సిరి లపై మండిపడ్డాడు షన్ను.

మిమ్మల్ని నమ్మినందుకు నన్ను వెధవని చేశారు, ఎదుటి ఉండకండి వెళ్ళిపొండి అంటూ కోపంతో చిందులు వేసాడు. జస్వంత్ బాధపడుతూ దూరంగా వెళ్ళిపోయాడు. సిరి షణ్ముఖ్ వచ్చినప్పుడు బోరున ఏడ్చేసింది. అయినా షణ్ముఖ్ ఏమాత్రం పట్టించుకోలేదు. బిగ్ బాస్ పన్నిన వలలో ఇలా ముగ్గురూ బలయ్యారు. అందుకే ఇంటి సభ్యలు కాదు అప్పుడపుడు బిగ్ బాస్ కూడా శత్రువుగా మారుతుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: