మాటీవీలో గత రెండు సంవత్సరాలుగా ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ దేవత. దేవత సీరియల్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో చెప్పనవసరం లేదు. ఆ సీరియల్ లో నటించే నటీనటులు కూడా అంతే క్రేజ్ సంపాదించారు. ఇకపోతే ఈ సీరియల్ లో అందం , అభినయంతో పాటు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన రుక్మిణి రియల్ లైఫ్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అంతేకాదు ఈ సీరియల్ లో ఈమె ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం. రుక్మిణి అసలు పేరు సుహాసిని.. ఈమె 1983 మే 26వ తేదీన నెల్లూరు జిల్లాలో వెంకటరెడ్డి, జ్యోతి దంపతులకు జన్మించింది.


ఈమెకు అనుదీప్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక సుహాసిని తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే తన కెరియర్ ను మొదలు పెట్టింది. చంటిగాడు సినిమా ద్వారా కీలకపాత్ర పోషిస్తూ వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ సుహాసిని తల్లిదండ్రులకు మాత్రం ఆమె నటన రంగంలోకి అడుగుపెట్టడం ఇష్టం లేదు. చంటిగాడు సినిమా విజయవంతం కావడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె నటన రంగ ప్రవేశానికి అంగీకరించారు. ఆ తర్వాత లక్ష్మీ  కళ్యాణం, అడ్డా, పెదబాబు, దోస్త్, గుణ , సుందరానికి తొందరెక్కువ, పున్నమినాగు, భూ కైలాష్, హైవే ఇలా వరుసగా 30 సినిమాలలో నటించింది.

ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ , భోజ్ పురి వంటి భాషా చిత్రాలలో కూడా నటించింది.2013 లో వెండితెరకు స్వస్తి పలుకుతూ అపరంజి సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ లో ఈమెకు తండ్రిగా నాగబాబు నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అష్టాచమ్మా,  అనుబంధాలు, ఇద్దరమ్మాయిలు,  నా కోడలు బంగారం, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ లో నటించింది. అంతేకాదు ఎన్నో తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటిస్తున్నప్పుడు తన కోస్టార్ ధర్మ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.2012 లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును సొంతం చేసుకోవడమే కాదు పలు సీరియల్స్ కు నిర్మాతగా కూడా వ్యవహరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: