స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ బ్రహ్మముడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ సీరియల్ లో రుద్రాణిగా తనదైన యాక్టింగ్ తో ఇరగదీస్తున్న నటి షర్మిత గౌడ.. కర్ణాటక కు చెందిన ఈ బ్యూటీ కి తాజాగా ఒక అవార్డు లభించింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రలో అద్భుతంగా నటిస్తోంది షర్మిత. ఇక ఈమె అందం, కట్టుబొట్టు చూస్తే హీరోయిన్లు కూడా ఈమె పక్కన పనికిరారు అన్నంత అందంగా ఉంటుంది.

ఈ సీరియల్లో హీరో రాజ్ కి అత్తగా ఆమె వేసే ఎత్తులు, ప్లాన్లు అన్నీ ఇన్నీ కావని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ కావ్యాను ఇబ్బంది పెట్టే సన్నివేశాలలో ఈమె నటన పీక్స్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు ఒక అవార్డు లభించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగులో బ్రహ్మముడి సీరియల్ చేస్తున్న షర్మిత కన్నడలో గీత అనే సీరియల్ లో నటిస్తోంది .అందులో కూడా విలన్ షేడ్స్ ఉన్న భానుమతి పాత్రను ఆమె అద్భుతంగా పండిస్తోంది. ఈ పాత్రలో యాక్టింగ్ కి గానూ .. తాజాగా "అనుబంధ అవార్డ్స్ 2023"లో ఆమెకు పురస్కారం లభించింది.

ఇక ఈ గీత సీరియల్ కన్నడ టీవీ ఇండస్ట్రీలో అత్యధిక రేటింగ్స్ సాధిస్తున్న సీరియల్స్ లో ఒకటిగా నిలవడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది షర్మిత. అయితే ఇదే సీరియల్ లో ఆమె చేస్తున్న భానుమతి పాత్రకు 2021 లో కూడా అవార్డును అందుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే పాత్రకు అవార్డు దక్కించుకోవడంతో ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: