బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత శివాజీ తాను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని అసలు అబద్ధాలు ఎలా ఉంటాయో తెలియదు అంటూ చాలా ఫోజులు కొడుతున్నారు.. ముఖ్యంగా శివాజీ చెప్పేది ఒకరకంగా ఉంటుంది చేసే పనులు మరోరకంగా ఉంటుంది.. బిగ్ బాస్ షోలో ఆడవాళ్ళ గురించి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది. దీంతో శోభ కోపంతో అరిచినందుకు కానీ అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని అంటూ నోటికొచ్చింది వాగడం జరిగింది శివాజీ.
అలా అనడం తప్పని నాగార్జున చెప్పిన కూడా వినిపించుకోలేదు.. ఒకవేళ తన ఇంట్లో ఆడపిల్ల ఇలా ఉండి ఇలా ప్రవర్తిస్తే రెండు పీకుతానంటూ కూడా సమాధానాన్ని ఇచ్చారు.. శివాజీ ఇలా మాట్లాడడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు..హౌస్ లో ఉండే ప్రియాంక శోభాను ఎప్పుడూ కూడా ఏదో ఒక తక్కువ చేసి మాట్లాడేవారు శివాజీ ఈ నేపథ్యంలోనే మాజీ కంటెస్టెంట్ నటుడు సమీర్ శివాజీ గురించి ఒక విషయాన్ని బయట పెట్టారు.. శివాజీకి ఇద్దరు కుమారులతో పాటు ఒక కూతురు కూడా ఉందని ఎక్కడా తన కూతురు గురించి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.. స్టేజ్ మీదికి కూడా తన కొడుకులని చూపించారు కానీ కూతురుని చూపించలేదు ఇన్నాళ్లు శివాజీ దాచుకున్న గుర్తును సైతం ఇలా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది. మరి ఈ విషయాన్ని శివాజీ ఎందుకు దాచిపెట్టారో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి