
గత తెలుగు బిగ్ బాస్ సీజన్ -6 లో కంటెస్టెంట్ గా ఆడియన్స్ కి బాగా సుపరిచితముయ్యింది నటి శ్రీ సత్య.. మొదట మోడల్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో పలు రకాల పాత్రలో నటించడానికి ట్రై చేసింది.సీరియల్స్ లో కూడా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ పాపులారిటీ పెంచుకుంది. అలా సినిమాలు సీరియల్స్ తో పలు రకాల ఇంటర్వ్యూలతో ఆకట్టుకుంటూ ఉంటుంది శ్రీ సత్య.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ సమయంలో తనకు ఒక ఆఫర్ వచ్చిందని కానీ అది మిస్సయిందని వెల్లడించింది. మొదట హీరోయిన్ అని చెప్పి చివరిలో మాట మార్చేశారని వెల్లడించింది. ఆ సినిమా ఏదో కాదు డీజే టిల్లు స్క్వేర్. ముందు ఈ సినిమాలో తనని ఫస్ట్ హీరోయిన్ గానే ఎంపిక చేస్తామంటూ మేకర్స్ వెల్లడించారట. దీంతో తాను ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్టులకు కూడా అసలు ఒప్పుకోలేదని ఈ సినిమా కోసమే వెయిట్ చేశానని శ్రీ సత్య తెలిపింది.
కానీ ఆ సినిమా షూటింగ్ను ప్రారంభించి రిలీజ్ చేశారు. ఆ సమయంలో తన చాలా బాధపడ్డానని వెయిట్ చేయించి మరి తనని అవమానించారంటూ చాలా గట్టిగా ఫీలయ్యారని తెలిపింది శ్రీ సత్య. అలాగే సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా తనని ఒక సీనియర్ నటి కూడా అవమానించిందని వెల్లడించింది. కొత్త నటిగా అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఒక మనిషిగా కూడా విలువ ఇవ్వకుండా మాట్లాడిందని.. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనే విషయాలను అప్పుడే నేర్చుకున్నానని ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యానని తెలిపింది శ్రీ సత్య.. 2018లో మొదటిసారిగా నిన్నే పెళ్ళాడుతా అని సీరియల్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ముద్దమందారం , త్రినయని తదితర సీరియల్స్ లో నటించింది. ఇక తొందర పడకు సుందర వదన అని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. నేను శైలజ సినిమాలో కూడా నటించింది శ్రీ సత్య.