
అసలు విషయంలోకి వెళ్తే తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి నిహానాబేగం పొన్ని, పాండియన్ స్టోర్స్ వంటి సీరియస్లలో నటించింది. అయితే ఈమె రాజ్ కన్నన్ అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్తను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు ఆ వ్యాపారవేత్త ఆరోపిస్తున్నారు. దీంతో ఈ విషయం పైన పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేశారట. నటి నిహానాబేగం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని చెప్పి తనని వివాహం చేసుకుందని స్టేషన్లో ఫిర్యాదు చేశారట.
మొదట తనతో పరిచయం చేసుకొని ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చుకొని మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు వ్యాపారవేత్త రాజ్ కన్నన్ తెలిపారు. అయితే వివాహం చేసుకున్న తర్వాత తన మొదటి భర్త నుంచి ఆమె ఎలాంటి విడాకులు కూడా తీసుకోలేదని తెలిసిందని దీంతో తనను మోసం చేసి 20 లక్షల రూపాయలు కూడా తీసుకుందని ఆరోపణలు చేశారు. అలా మోసం చేసిన ఈ నటి పైన తగిన చర్యలు తీసుకోవాలని అలాగే తన దగ్గర నుంచి తీసుకున్న రూ.20 లక్షల రూపాయలను కూడా ఇప్పించాలని కోరారు రాజ్ కన్నన్. దీంతో అటు పోలీసులు నటి నిహానా బేగం, రాజ్ కన్నను పిలిపించి విచారణ చేపడుతున్నారు. మరి ఈ విషయం పైన నటి నిహానాబేగం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.