ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సడన్గా వివాహాలు చేసుకొని ,ఎంగేజ్మెంట్లు చేసుకొని షాకిస్తున్నారు. అలా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆషాడమాసం సీజన్  కావడంతో వివాహాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. తాజాగా తమిళ నటుడు అర్జున్ చిదంబరం వివాహం చేసుకోగా ఇప్పుడు మరొక నటి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. అది కూడా ఎలాంటి హడావిడి లేకుండా కేవలం ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది ఈ నటి. మరి ఆ నటి ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


చెన్నైకి చెందిన రిత్విక 2013లో మొదటిసారి పరదేశి అనే చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కబాలి, మద్రాస్, టార్చ్ లైట్ తదితర చిత్రాలలో నటించింది. అయితే ఈమె ఎన్నో రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది. తాజాగా ఈ నటి వినోద్ లక్ష్మణ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలియజేసింది .ఈ క్రమంలోనే ఒక వీడియోని షేర్ చేయగా ఈ విషయం విన్న అభిమానులు తోటి నటినటులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఇప్పటివరకు పెళ్లి తేదికి సంబంధించి పూర్తి వివరాలు తెలపలేదు త్వరలోనే  ప్రకటిస్తారేమో చూడాలి.


నటి రిత్విక సినిమాలతో పాటుగా ఇమే పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొనింది. ముఖ్యంగా తమిళ బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొన్న రితిక విజేతగా నిలిచింది. దీంతో అప్పటినుంచి ఈమెకు మరింత క్రేజ్ పెరగడంతో ఆ క్రేజ్ సినిమా అవకాశాలను తీసుకువచ్చేలా చేసింది. రితిక నటిగా అడపాదడపా సినిమాలో చేస్తూనే ఉన్నది. ఇటీవలే ఎలెవన్, డిఎన్ఏ వంటి చిత్రాలలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరి రితిక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ రింగ్స్ తో పాటు తన కాబోయే  భర్తతో కలిసి రింగ్ మార్చుకున్నట్లుగా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: