
బిగ్ బాస్ సీజన్ 19 ఎవరెవరు వస్తారనే విషయంపై సోషల్ మీడియాలో కంటెస్టెన్స్ లిస్టు కూడా వైరల్ గా మారుతోంది. దీని ప్రకారం చూసుకుంటే బాల నటిగా ఉన్న ఆన్నూరు కౌర్, నటుడు గౌరవ్ ఖన్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ అవేజి దర్బార్, నగ్మా మీరాజ్కర్, షఫాక్ నాజ్, అభిషేక్ బజాజ్, బహిర్ అలీ, హునార్ హలే మరి కొంతమంది గేమ్ డెవలపర్స్ కూడా ఇందులో కనిపించబోతున్నారట. అయితే వీటితోపాటు తెలుగు బిగ్ బాస్ 5 రన్నర్ శ్రీరామచంద్ర, ప్రియా రెడ్డి, మరాఠీ నుంచి ఆర్భాజ్ పటేల్ తో పాటుగా అతుల్ కిషన్, మరి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.
ఇలా ఎంతమంది పేర్లు వైరల్ గా మారిన ఆగస్టు 24 సాయంత్రం 9 గంటలకు టెలికాస్ట్ కావడంతో క్లారిటీ వస్తుంది..గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం ఏమిటంటే లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈసారి బిగ్ బాస్ 19 లో కనిపించబోతున్నారని అందుకు సంబంధించి నిర్వాహకులు కూడా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మైక్ టైసన్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వారం రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.