
అయితే ఇదే షో కి చాలామంది యూట్యూబర్స్, కొంతమంది జబర్దస్త్ కమెడియన్ తమ జోడిలను తీసుకువచ్చారు. వినోద్ కూడా తన భార్యను తీసుకువచ్చారు. ప్రోమోలు చూపించిన మేరకు.. ప్రోమో మొత్తం చాలా ఫన్నీగా సాగిన తర్వాత చివరిలో ఎమోషనల్ గా జబర్దస్త్ వినోద్ తన గురించి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన గురించి తెలియజేశారు. ముఖ్యంగా తాను బ్యాడ్ సిట్యువేషన్ లో ఉన్న సమయంలో హెల్త్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలని దిండు కింద బ్లేడు పెట్టుకున్నానని తెలియజేశారు వినోద్.
ఈ విషయం విన్న వెంటనే అటు జడ్జిగా ఉన్న ఇంద్రజతో సహా పక్కనున్న వారందరూ కూడా ఎమోషనల్ గా కనిపించారు. వినోద్ భార్య కూడా ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉన్నారు. జబర్దస్త్ వినోద్ ఈ మాటలు చెప్పిన తర్వాత చాలామంది అభిమానులు అసలు వినోద్ కి అలాంటి కష్టం ఎందుకు వచ్చింది అంటు ప్రశ్నిస్తున్నారు?. గతంలో కూడా తన ఇంటి విషయంలో ఏవో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తనపైన కూడా దాడి జరిగిందనే విషయాన్ని తెలుపుతూ రూ.10 లక్షల రూపాయలు మోసం చేశారని తెలిపారు వినోద్. ఈ విషయానికేమైన సూసైడ్ చేసుకోవాలనుకున్నారెమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. మరి అసలు విషయం ఏంటి అనేది చూడాలి.