ఇది అందరికీ ఒకే కాలంలో జరగదని వివరించింది. ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే చాట్ లిస్ట్‌ను యాక్సెస్ చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే, ఇన్‌కమింగ్ ఫోన్, వీడియో కాల్స్‌కు ఆన్సర్ చేయగలరని పేర్కొంది. అది కొంత కాలం మాత్రమేనని, అప్పటికీ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ రావని, అంతేకాక మెసేజ్ పంపడం, కాల్స్ చేయడం కూడా ఆగిపోతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు అంగీకరించకున్నా యూజర్ల ఖాతాలను డిలీట్ చేయబోమని, అప్పటికే వారు అంగీకరించిన పాత పాలసీ వర్తిస్తుందని తెలిపింది. సాధారణంగా వాట్సాప్ ఖాతాలు 120 రోజుల పాటు ఇనాక్టివ్‌గా ఉంటే ఆ తర్వాత అవి డిలీట్ అవుతాయి. దీంతో ఈ విషయం తెలిసి వాట్సాప్ యూజర్లు ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై వాట్సాప్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి