మీకు బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉందా ? అలాగే జన్ ధన్ ఖాతా కలిగి ఉన్నారా ? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆ విషయం ఏమిటంటే , జన ధన్ ఖాతా తో ఆధార్ కార్డు ను  కచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. జన ధన్ ఖాతా తో ఆధార్ లింక్ చేయలేకపోతే దాదాపుగా రూ.2లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.


జన్ ధన్ ఖాతా కలిగి ఉండేవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే మీ జన్ ధన్ బ్యాంకు ఖాతాకు  ఆధార్ కార్డు ను లింక్ చేసుకుంటేనే ఈ బెన్ఫిట్ లను పొందవచ్చు. ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఈ బెనిఫిట్ పొందలేరు. అంతేకాకుండా జన్ ధన్ ఖాతా కలిగినవారికి కి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

ఈ ఇన్సూరెన్స్ ద్వారా రూ.30 వేల వరకు భీమా లభిస్తుంది. ఒకవేళ అకౌంట్ కలిగిన వారు మరణిస్తే, వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి. ఆధార్ లింక్ చేయకపోతే ఈ డబ్బులు కూడా పొందలేకపోవచ్చు. అందువల్ల మీరు జన్ ధన్ ఖాతా బ్యాంకు నెంబర్ కి ఆధార్ లింక్ చేసుకోకపోవడం వల్ల రూ.2.3 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు వెంటనే బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి ఆధార్ నెంబర్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా ఎప్పుడైనా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర జన్ ధన్ ఖాతా లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి అందుకు సంబంధించిన పత్రాలను పొందుపరిచి, జన్ ధన్ ఖాతా ను ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరికైతే జన్ ధన్ ఖాతా ఉందో , వారందరికీ ఈ బెనిఫిట్స్ లభిస్తాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: