భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరు పొందింది రైల్వే సంస్థ. ఇందులో రోజుకి ఎంతోమంది ప్రయాణిస్తూనే ఉంటారు.రైలులో ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది. ఇలా సుఖంగా మన ప్రయాణించాలంటే అందుకోసం ముందుగా రైల్వే టికెట్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకసారి రిజర్వేషన్లు అవుతూ ఉంటాయి, ఒక్కోసారి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే అక్కడ ఉండే సీట్లను బట్టి రిజర్వేషన్లు అవుతూ ఉంటాయి. రైల్వేలో ప్రయాణం చేయాలంటే పలు రకాలుగా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్, irctc యాప్ ద్వారా అయినా మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు, టికెట్ ఏజెన్సీ ద్వారా అయినా బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా మనకి మరెన్నో సదుపాయాలను కూడా కల్పించింది రైల్వే సంస్థ.

అయితే రైల్వేలో వెయిటింగ్ లిస్టులో ఉండేటువంటి.GNWL, PQWL,RLGNE,RLWL,RAC,RSWL,WL,CKWL అనే వర్డ్ కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క అర్థాలను తెలియని వారు ఇప్పుడు తెలుసుకుందాం.

1).GNWL: మనం టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నప్పుడు అందులో GNWL ఉంటుంది.మీకు ఇలా కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఒకవేళ రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి రూట్ మధ్యలో ఏదైనా స్టేషన్ నుంచి మనం టికెట్లు బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్టు ఉంటే ఇలా మనకు చూపించడం గమనార్హం.

2).RAC:
ఈ జాబితాలో ఉంటే మనకు రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ లిస్టులో ఉంటే చాలా వరకు కన్ఫార్మ్ అయినట్లే. ఎందుకంటే ఒక్కోసారి ఓకే బెర్త్ ను ఇద్దరికి కేటాయించడం , లేదా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసే లాగా కల్పిస్తారు.

3).WL: వెయిటింగ్ లిస్ట్:
ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు టికెట్ కన్ఫామ్ కాకపోతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఇలా చూపించడం గమనార్హం. టికెట్ బుక్ చేసుకున్న వారు ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఆ స్థానంలో మీకు టికెట్ కన్ఫామ్ చేస్తారు.

4).RLWL:  రిమూవ్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ :
ఇలా వచ్చినప్పుడు బుక్ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్టులో ఇలా వస్తె  టికెట్లు కన్ఫర్మ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

5).RSWL: రోడ్ సైడ్ స్టేషన్ వెయిటింగ్ లిస్ట్:
ఏవైనా స్టేషన్లు మధ్యలో బెర్త్ లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే మనకు ఇలా చూపిస్తుంది.

6).RQWL : రిక్వెస్ట్ వెయిటింగ్ లిస్ట్:
మార్గం మధ్యలో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ ను  టికెట్ బుక్ చేసుకున్నప్పుడు జనరల్ కోటాలో వుంటే ఇలా కనిపిస్తుంది.

7).TQWL:
ఇది తత్కాల్  కోటా కింద వస్తుంది కాబట్టి తత్కాల్  లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: