ఈ స్మార్ట్ మొబైల్ కి ఉండే డ్రోన్ కెమెరా 200 మెగాపిక్సల్ పిక్చర్ తో ఉంటుంది. ఇప్పటివరకు చాలా కంపెనీల సైతం 200 మెగా ఫిక్సెల్ తో పలు మొబైల్స్ ను ప్రకటించాయి కానీ వివో మాత్రమే ఆ దిశగా ప్రస్తుతం ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ మొబైల్ 7 అంగుళాల డిస్ప్లే తో కలదు. 32 మెగా ఫిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 64 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కలదు. ఇక అంతే కాకుండా బ్యాటరీ విషయానికి వస్తే 6900 MAH సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 36 గంటల వరకు పనిచేస్తుంది.
ఇక బ్యాటరీ చార్జింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 65W కెపాసిటీ కలదు. 256 GB,512 GB స్టోరేజ్ లతోపాటు 12 GB ram మొబైల్ వేరియంట్లలో ఉండవచ్చు. ఇక ఈ మొబైల్ కి ఫ్లయింగ్ కెమెరాతోపాటు సెన్సార్ కూడా కలదు. దీని సహాయంగానే కెమెరా గాలిలో ఎగురుతున్నప్పుడు ఇతర వస్తువులను ఢీకొట్టకుండా తగినంత ఎత్తులో మాత్రమే ఎగర గలదు. ఈ మొబైల్ వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి